మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Ghatikachala Yoga Narasimha Mangalam – శ్రీ ఘటికాచల యోగనృసింహ మంగళం


ఘటికాచలశృంగాగ్ర విమానోదరవాసినే |
నిఖిలామరసేవ్యాయ నరసింహాయ మంగళమ్ || 1 ||

ఉదీచీరంగనివసత్ సుమనస్తోమసూక్తిభిః |
నిత్యాభివృద్ధయశసే నరసింహాయ మంగళమ్ || 2 ||

సుధావల్లీపరిష్వంగసురభీకృతవక్షసే |
ఘటికాద్రినివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్ || 3 ||

సర్వారిష్టవినాశాయ సర్వేష్టఫలదాయినే |
ఘటికాద్రినివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్ || 4 ||

మహాగురుమనఃపద్మమధ్యనిత్యనివాసినే |
భక్తోచితాయ భవతాత్ మంగళం శాశ్వతీః సమాః || 5 ||

శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందన హేతవే |
నందనందనసుందర్యై గోదాయై నిత్యమంగళమ్ || 6 ||

శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వనః |
కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళమ్ || 7 ||

పాదుకే యతిరాజస్య కథయంతి యదాఖ్యయా |
తస్య దాశరథేః పాదౌ శిరసా ధారయామ్యహమ్ || 8 ||

శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే |
శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్యమంగళమ్ || 9 ||

సౌమ్యజామాతృయోగీంద్ర చరణాంబుజషట్పదమ్ |
దేవరాజగురుం వందే దివ్యజ్ఞానప్రదం శుభమ్ || 10 ||

వాధూలశ్రీనివాసార్యతనయం వినయాధికమ్ |
ప్రజ్ఞానిధిం ప్రపద్యేఽహం శ్రీనివాసమహాగురుమ్ || 11 ||

చండమారుతవేదాంతవిజయాదిస్వసూక్తిభిః |
వేదాంతరక్షకాయాస్తు మహాచార్యాయ మంగళమ్ || 12 ||

ఇతి శ్రీ ఘటికాచల యోగనృసింహ మంగళ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.